మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

 

Sri Gopala Stava (Dashavatara Stava) – శ్రీ గోపాల స్తవః (దశావతార స్తవః)


యేన మీనస్వరూపేణ వేదాః సంరక్షితాః పురా |
స ఏవ వేదసంహర్తా గోపాలః శరణం మమ || 1 ||

పృష్ఠే యః కూర్మరూపేణ దధార ధరణీతలమ్ |
స ఏవ సృష్టిసంహర్తా గోపాలః శరణం మమ || 2 ||

వరాహరూపః సంభూత్వా దంష్టాగ్రే యో మహీం దధౌ |
స భూమిభారహరణో గోపాలః శరణం మమ || 3 ||

జగ్రాహ యో నృసింహస్య రూపం ప్రహ్లాదహేతవే |
స యోద్ధుముద్యతః సమ్యగ్గోపాలః శరణం మమ || 4 ||

యేన వామనరూపేణ వంచితో బలిభూమిపః |
స ఏవ గోపనారీభిర్గోపాలః శరణం మమ || 5 ||

యేనేయం జామదగ్న్యేన పృథ్వీ నిఃక్షత్త్రియా కృతా |
స ఏవ క్షత్త్రియహితో గోపాలః శరణం మమ || 6 ||

దశాస్యో దాశరథినా యేన రామేణ మారితః |
స పంచాస్యప్రాప్తబలో గోపాలః శరణం మమ || 7 ||

కాళిందీ కర్షితా యేన రామరూపేణ కౌతుకాత్ |
తజ్జలక్రీడనాసక్తో గోపాలః శరణం మమ || 8 ||

యేన బౌద్ధస్వరూపేణ లోకాః పాఖండమార్గగాః |
స ఏవ పాఖండహరో గోపాలః శరణం మమ || 9 ||

గమిష్యంతి క్షయం యేన రాక్షసాః కల్కిరూపిణా |
స రాక్షసం గతేర్దాతా గోపాలః శరణం మమ || 10 ||

గోవర్ధనో గిరిర్యేన స్థాపితః కంజవత్కరే |
ఉలూఖలేన సహితో గోపాలః శరణం మమ || 11 ||

ఏకాదశస్వీయధామ్నామావళిం యో లిఖేద్ధృది |
కృష్ణప్రసాదయుక్తశ్చ స యాతి పరమాం గతిమ్ || 12 ||

ఇతి శ్రీరఘునాథాచార్య విరచితం శ్రీ గోపాల స్తవః ||

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.